News February 7, 2025

HYD: స్కూల్ పిల్లల డేంజర్‌ జర్నీ

image

నిబంధనలు పాటించని స్కూల్ వ్యాన్‌లపై RTA అధికారులు <<15385435>>తనిఖీలు<<>> చేపట్టి సీజ్ చేస్తుంటే, మరికొందరు ఇవేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓమ్నీ వెహికల్‌లో ఓ డ్రైవర్ ఏకంగా 25 మందిని ఎక్కించాడు. నాదర్గుల్ నుంచి బడంగ్‌పేటకు వెళ్లే రూట్‌లో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులను ఇలా తీసుకెళ్లడం ఏంటని స్థానికులు నిలదీశారు. వ్యాన్ మీద, డోర్లు ఓపెన్ చేసి ప్రమాదకరంగా తరలించడం గమనార్హం.

Similar News

News December 1, 2025

నందికొట్కూరు ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ ఎంపీడీవోలు

image

నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సోమవారం కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నందికొట్కూరు డిప్యూటీ ఎంపీడీవో పాండురంగారెడ్డి, మిడుతూరు ఎంపీడీవో సురేశ్ కుమార్, పగిడ్యాల ఎంపీడీవో మన్సూర్ బాషా, జూపాడుబంగ్లా ఎంపీడీవో మోహన్ నాయక్, పాములపాడు ఎంపీడీవో తిరుపాలయ్య, కొత్తపల్లి ఎంపీడీవో పీఎస్ఆర్ శర్మ ఉన్నారు.

News December 1, 2025

టీటీడీలో అన్యమతస్తులపై నివేదిక తయారీ

image

టీటీడీలో అన్యమతస్తుల అంశం మరోసారి తెర పైకి వచ్చింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలో ఇంకా ఎవరైనా ఆన్యమతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.

News December 1, 2025

సంగారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

image

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ పారితోష్ పంకజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 మంది సమస్యలు విన్నవించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఎస్పీ ఆదేశించారు.