News February 7, 2025
HYD: స్కూల్ పిల్లల డేంజర్ జర్నీ

నిబంధనలు పాటించని స్కూల్ వ్యాన్‌లపై RTA అధికారులు <<15385435>>తనిఖీలు<<>> చేపట్టి సీజ్ చేస్తుంటే, మరికొందరు ఇవేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓమ్నీ వెహికల్‌లో ఓ డ్రైవర్ ఏకంగా 25 మందిని ఎక్కించాడు. నాదర్గుల్ నుంచి బడంగ్‌పేటకు వెళ్లే రూట్‌లో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులను ఇలా తీసుకెళ్లడం ఏంటని స్థానికులు నిలదీశారు. వ్యాన్ మీద, డోర్లు ఓపెన్ చేసి ప్రమాదకరంగా తరలించడం గమనార్హం.
Similar News
News April 17, 2026
HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు ‘పరిశీలిస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!
News April 17, 2026
HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు <<19672685>>’పరిశీలిస్తాం’<<>> అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!
News April 17, 2026
ఏపీ SECగా అనిల్ చంద్ర.. గవర్నర్ ఆమోదం

AP: స్టేట్ ఎలక్షన్ కమిషనర్(SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. కాసేపట్లో జీవో వెలువడనుంది. అనిల్ చంద్ర గతంలో రాష్ట్ర సీఎస్‌గా పనిచేశారు. రిటైరైన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెలాఖరుతో SECగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.


