News March 29, 2024
HYD: స్కై రూట్ విక్రమ్ ఆర్బిటాల్ TEST సక్సెస్
HYD ఆధారిత స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ తన విక్రమ్-1 రాకెట్ కక్షలో స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. ఆర్బిటాల్ రాకెట్‌కు కలాం-250గా పేరు పెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొపల్షన్ టెస్ట్‌బెడ్ వద్ద నిర్వహించినట్లు తెలిపింది. HYD నగరంలో ఏరోస్పేస్ స్టార్ట్ అప్ స్కై రూట్ పై పలుమార్లు మాజీ మంత్రి KTR ప్రశంసలు కురిపించారు.
Similar News
News January 13, 2025
HYD: కాస్త ఆగండి.. 4 నెలల్లో సమస్యలు తీరతాయి
HYD దుర్గంచెరువు FTL వివాదాలకు 4 నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మెన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. HYD రాయదుర్గం చెరువు FTL నిర్ధారణలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో పాటు, ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థల ఇంజినీర్లను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. వాస్తవానికి 65.12 ఎకరాలు కాగా, ఒక్కో శాఖ ఒక్కో లెక్క చెబుతోందని స్థానికులన్నారు.
News January 13, 2025
రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత
రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో చందనవెల్లిలో 13.8℃, రెడ్డిపల్లె, తాళ్లపల్లి 14.2, కాసులాబాద్ 14.3, ఎలిమినేడు, రాచులూరు 14.4, షాబాద్ 14.5, రాజేంద్రనగర్, మీర్‌ఖాన్‌పేట 14.6, ఇబ్రహీంపట్నం వైట్‌గోల్డ్ ప్రాంతం, మంగళపల్లె 14.9, అమీర్‌పేట, కేతిరెడ్డిపల్లిలో 15℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News January 13, 2025
HYD: నుమాయిష్‌కు ఇప్పటివరకు 2.75 లక్షల మంది
HYDలో జరుగుతున్న 84వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్‌కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. దాదాపు 75 వేల మంది సందర్శించారని పేర్కొన్నారు. 80 సీసీ కెమెరాలతో ఎగ్జిబిషన్‌లో నిఘాను ముమ్మరం చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.75 లక్షల మంది ఎగ్జిబిషన్‌కు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.