News February 12, 2025
HYD: స్టూడెంట్ మృతి.. శ్రీ చైతన్య ప్రిన్సిపల్‌పై కేసు (UPDATE)

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సూసైడ్ కేసులో పాఠశాల ప్రిన్సిపల్ పై కేసు నమోదయింది. ఇదే విషయంపై Way2News ప్రతినిధి మేడ్చల్ ACP బి.శ్రీనివాస్ రెడ్డితో ఫోన్ లైన్‌లో మాట్లాడారు. విద్యార్థిని తల్లి కమల ఫిర్యాదు మేరకు శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
Similar News
News March 28, 2025
HYD: మీరు ఇందులో నీళ్లు తాగుతున్నారా?

RO ప్లాంట్లు HYDలో విపరీతంగా పుట్టుకొచ్చాయి. కిరాణా షాపుల్లోనూ 20L వాటర్ రూ.15-20కి విక్రయిస్తున్నారు. ఈ ప్లాంట్ల నీరు తాగడంతో కిడ్నీల సమస్యలు, జట్టురాలడం, గుండె సమస్యలు వస్తాయని రుజువైంది. సోడియం సల్ఫేట్, పొటాషియం వంటి ఖనిజాలు కలిపితేనే మినరల్ వాటర్. RO వాటర్‌లో ఇవన్నీ ఉండవు. నాసీరకం క్యాన్లలో నీరుతాగినా ప్రమాదాన్ని కొనుక్కున్నట్లే. సర్టిఫైడ్ ప్లాంట్లలో, నాణ్యమైన డబ్బాల్లో నీటిని తెచ్చుకోవాలి.
News March 28, 2025
రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం చుక్కాపూర్లో 39.6℃, మాడ్గుల్, మంగళ్‌పల్లె 39.5, మీర్‌ఖాన్‌పేట 39.4, కందవాడ 39.3, కడ్తాల్, కాసులాబాద్ 39.2, ఇబ్రహీంపట్నం, ఎలిమినేడు 39.1, రాజేంద్రనగర్, చందనవెల్లి 39, ముద్విన్, తాళ్లపల్లి, దండుమైలారం 38.9, మొగలిగిద్ద 38.8, యాచారం, షాబాద్ 38.7, కేశంపేట 38.6, వెల్జాల 38.5, తట్టిఅన్నారం 38.4℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 28, 2025
HYD: కూతురిని హత్య చేసిన తల్లి

కూతురిని తల్లి హత్య చేసిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి దంపతులు. భర్త మణికి 2 మూత్రపిండాలు పాడవగా.. 15 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఆమె పెద్దయ్యాక పెళ్లి ఖర్చులు ఉంటాయని భావించి మంగళవారం నీళ్ల బకెట్‌లో వేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.