News December 27, 2024
HYD: స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం

ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్‌సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు. ఈ ఏడాది హర్యానాకు చెందిన ఆరుగురు సెయిలర్లు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నారు.
Similar News
News October 19, 2025
జూబ్లీ బైపోల్: ఇప్పటికి 127.. ఉన్నది ఒక్కరోజే!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు జోరందుకున్నాయి. అధికారులు ఊహించని విధంగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 127 మంది పోటీచేస్తామంటూ ముందుకువచ్చారు. నామినేషన్లు వేసేందుకు తుది గడువు 3 రోజుల (21వ తేదీ వరకు) సమయమున్నా.. ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. 19 ఆదివారం, 20న దీపావళి కావడంతో మంగళవారం ఆఖరి రోజు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి నామినేషన్ వేస్తామని పలువురు ప్రకటించడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.
News October 19, 2025
జూబ్లీ బరిలో ఎవ్వరూ తగ్గట్లేదుగా

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. వచ్చేనెల 11న జరిగే ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారం జోరుపెంచాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ 40 మందిని ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను నియమించగా గులాబీ దళం నుంచి 60 మందిని నియమించింది. ఇరు పార్టీలు కీలకనేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాయి. రాష్ట్ర రాజకీయాలు గ్రౌండ్ లెవల్‌కు వచ్చాయనే చర్చ నడుస్తోంది.
News October 19, 2025
HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్ పేరుతో మోసం

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్డీ లెటర్హెడ్లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్‌కు బదిలీ చేశారు.