News December 27, 2024

HYD: స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం

image

ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్‌సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్‌తో సందడి చేశారు. ఈ ఏడాది హర్యానాకు చెందిన ఆరుగురు సెయిలర్లు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నారు.

Similar News

News January 18, 2025

HYD: రేవంత్ విదేశీ పర్యటనపై KTR కామెంట్స్

image

HYD: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గత విదేశీ పర్యటనలో రూ.40 వేల కోట్లు తెలంగాణకి CM చెప్పగా వాటిల్లో ఒక్క 40 పైసలు రాలేదన్నారు. నేను తెలంగాణలో ఎన్ని పరిశ్రమలు తెచ్చానో చెబుతా.. కాంగ్రెస్ వన్ ఇయర్‌లో ఎన్ని తెచ్చిందో చెప్పగలదా..? మణిపూర్‌లో పార్టీ మరీనా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ వాళ్లు కొట్లాడారన్నారు. హైకోర్టు తీర్పును సైతం స్పీకర్ పాలో అవ్వడం లేదని మండిపడ్డారు.

News January 18, 2025

HYD: ఫైర్ అలర్ట్ క్షణాల్లో తెలిసేలా టెక్నాలజీ: హైడ్రా కమిషనర్

image

HYD: ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో ఆ సమాచారం హైడ్రాకు చేరేలా టెక్నాలజీని తీసుకొని రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. తెల్లవారుజామున పాత ముంబై హైవే దారిలో అగ్ని ప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా.. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అక్కడి హైడ్రా డీఆర్ఎఫ్, ఫైర్ బృందాలను అడిగి తెలుసుకున్నారు.

News January 18, 2025

HYD: ఇంటర్ విద్యార్థుల ALERT.. ఈనెల 25 వరకు అవకాశం

image

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌ను ఇంటర్మీడియ‌ట్ బోర్డు అప్ర‌మ‌త్తం చేసింది. వార్షిక ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజును ఇప్ప‌టికీ చెల్లించ‌ని విద్యార్థులు.. ఆల‌స్య రుసుం రూ. 2500తో జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఇంట‌ర్ రెగ్యుల‌ర్, వొకేష‌న‌ల్ విద్యార్థుల‌తో పాటు ప్రైవేటు విద్యార్థులు కూడా ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించింది.