News March 9, 2026
HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 14, 2026
HYD: ఉదయం నుంచి రాత్రి వరకు ఆంక్షలు

నగరంలో నేడు డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్, లిబర్టీ, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో డైవర్షన్లు ఉంటాయి. 113, 6, 7Z, 8ల వంటి ఆర్‌టీసీ బస్సుల మార్గాలను కూడా మార్చారు. ప్రయాణికులు అంబేడ్కర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వంటి రద్దీ ప్రాంతాలను నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని
పోలీసులు సూచించారు.

అమీన్‌పూర్‌లో కూల్చివేతలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం ఏంటని, హైడ్రా విధివిధానాలు ఏంటో చెప్పాలని పేర్కొంది. ఇక చెరువులు, పార్కులు, రోడ్లు ఆక్రమిస్తే కూల్చివేయచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.