News February 1, 2025

HYD: స్వదేశాన్ని విమానంలో చుట్టేద్దాం!

image

విదేశాల్లో తిరగటం కంటే, మనోళ్లు స్వదేశంలో తిరిగేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల విడుదలైన రికార్డుల్లో తేలింది. AAI రిపోర్టు ప్రకారంగా.. ఒక నెలలో ఏకంగా 22.8 లక్షల మంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు విమాన సర్వీసులో ప్రయాణించినట్లుగా పేర్కొంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏకంగా 90కి పైగా నేషనల్, ఇంటర్నేషనల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

Similar News

News February 14, 2025

MLC ఎలక్షన్స్: బరిలో 90 మంది

image

TG: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్స్ స్థానానికి 15, వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీలో ఉన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుంది.

News February 14, 2025

భారత్‌ది ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే: మోదీ

image

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్‌కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.

News February 14, 2025

పరీక్షల కన్నా జీవితం పెద్దది: అదానీ

image

JEEలో ఫెయిల్ అయినందుకు UPలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై గౌతమ్ అదానీ విచారం వ్యక్తం చేశారు. ‘పరీక్షల కంటే జీవితం పెద్దది. ఈ విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లలకు వివరించాలి. నేను కూడా చదువులో, జీవితంలో చాలాసార్లు ఫెయిలయ్యాను. కానీ ప్రతీసారి జీవితం నాకు కొత్త మార్గాన్ని చూపింది. వైఫల్యాన్ని మీ చివరి గమ్యస్థానంగా పరిగణించవద్దు. లైఫ్ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!