News March 17, 2025
HYD: స్వశక్తితో బతకడంతో ఆత్మ గౌరవం పెరుగుతుంది: డీజీపీ

వివక్ష లేని సమాజం మహిళల హక్కు, సమానత్వమే మనం వారికి ఇచ్చే గౌరవమని సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారి భాగస్వామ్యంతో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వశక్తితో బతకడం ద్వారా మహిళల ఆత్మగౌరవం మరింతగా పెరుగుతుందన్నారు.
Similar News
News November 24, 2025
VIRAL: ట్రంప్ జూనియర్‌తో రామ్ చరణ్

US ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె వివాహ వేడుక ఉదయ్‌పూర్‌లోని రాజభవనంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను కలుసుకున్నారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి వైరలవుతోంది. ఇదీ చరణ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
News November 24, 2025
ఇండియాలో చీపెస్ట్ కార్లు ఇవే..

1.మారుతి సుజుకి S-Presso: రూ.3.50 లక్షలు
2.మారుతి సుజుకి Alto K10: రూ.3.70 లక్షలు
3.రెనాల్ట్ క్విడ్: రూ.4.30 లక్షలు
4.టాటా టియాగో: రూ.4.57 లక్షలు
5.మారుతి సుజుకి Celerio: రూ.4.70 లక్షలు
6.Citroen C3: రూ.4.80 లక్షలు
>పై ధరలన్నీ ఎక్స్-షోరూమ్‌వే.
News November 24, 2025
RECORD: ఎకరం రూ.137 కోట్లు

TG: హైదరాబాద్ కోకాపేట్లో భూములు రికార్డు ధర పలికాయి. నియోపొలిస్‌లో ప్లాట్ నం.17, 18లకు HMDA ఈ-వేలం నిర్వహించింది. ప్లాట్ నం.18లో ఎకరం భూమి రూ.137 కోట్లు, ప్లాట్ నం.17లో ఎకరం భూమి రూ.136.25 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలకు గాను HMDA రూ.1,355 కోట్లు దక్కించుకుంది. డిసెంబర్ 9న ప్లాట్ నం.19కు ఈ-వేలం జరగనుండగా ఎకరం రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.


