News February 16, 2025

HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

image

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు జరిగాయి. నేడు పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23)ను వెంబడించి మరీ అతని తమ్ముడు రాకేశ్ మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

Similar News

News February 25, 2026

HYD: బుక్స్‌ను గౌరవిద్దాం.. పర్యావరణాన్ని కాపాడదాం!

image

పరీక్షలు ముగిసిన తర్వాత పుస్తకాలను చింపి రోడ్లపై వేయకుండా, విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించాలని HYDలోని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పుస్తకాలు జ్ఞానానికి ప్రతీకలని, సరస్వతి దేవతతో సమామానంగా కొలిచే వాటిని అగౌరపరచొద్దని, అవసరమైనవారికి అందించాలని గుర్తు చేస్తున్నారు. రోడ్లపై పేపర్లు వేస్తే పారిశుద్ధ్య కార్మికులపై భారం పడుతుందని, నగరాన్ని నీట్‌గా ఉంచడంలో అందరూ సహకరించాలన్నారు.

News February 25, 2026

HYD: నలుపెక్కిన నగరం.. వర్ష సూచన

image

HYDలో ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. ఉప్పల్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాలను నల్లని మబ్బులు కమ్మేయగా, చల్లని గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. వర్ష ప్రభావ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల ఎండగా ఉన్నప్పటికీ ప్రయాణాలను పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. మీ ఏరియాలో వర్షం పడుతుందా?

News February 25, 2026

HYD: 21 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

image

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.