News February 18, 2025
HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

మేడ్చల్‌లో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు హత్యలు జరిగాయి. ఇటీవలే పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23) హత్య జరగ్గా, ఆదివారం రాత్రి వెంకటరమణ అనే వ్యక్తిని మైనర్ బాలుడు అయిన అతని అల్లుడు హత్య చేశాడు. వరుస హత్యలతో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
Similar News
News December 15, 2025
ఎన్నికల డ్యూటీ గైర్హాజరు.. కలెక్టర్ సీరియస్

ఫేస్- 1, ఫేస్-2 ఎన్నికల్లో గైర్హాజరైన 125 మంది పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కొంత మంది పోలింగ్ సిబ్బంది విధులకు హాజరై రిజిస్టర్లో సంతకాలు చేసి, విధులు నిర్వహించకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మూడవ విడతలో ఎవరైనా ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఉంటే సస్పెండ్ చేస్తానని ఆయన తెలిపారు.
News December 14, 2025
చేవెళ్ల: కూతురుకు ఓటేసి.. తండ్రి మృతి

ఎన్నికల్లో పోటీచేసిన తన కూతురుకి ఓటు వేసిన ఓ తండ్రి కుప్పకూలాడు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు సోలిపేట బుచ్చయ్య (70) చనిపోయారు. ఆలూరు పంచాయతీకి అనుబంధ గ్రామం వెంకన్నగూడ 14వ వార్డులో ఆయన కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలుగా పోటీలో ఉంది. ఓటు వేసి వస్తుండగా వృద్ధుడు కుప్పకూలి మృతి చెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
News December 14, 2025
చేవెళ్ల: సర్పంచ్ ఏకగ్రీవం.. ఒకే వార్డుకు ఎన్నిక.. ఫలితం ఉప సర్పంచ్

చేవెళ్ల మండలం చన్వెల్లి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైన విషయం విధితమే. ఈ పంచాయతీ పరిధిలోని మొత్తం 10 వార్డులు ఉండగా 9 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 8వ వార్డు జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు సుధాకర్(SC)తో పాటు ఓసీ అభ్యర్థి పి.దీపక్ రెడ్డి పోటీ పడ్డారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో దీపక్ రెడ్డి విజయం సాధించారు. ఉప సర్పంచ్‌గా అతను ఎన్నికయ్యారు.


