News April 6, 2025
HYD: హనుమంతుడు లేని రామాలయం!

అతి పురాతన ఆలయం మన HYD శివారులో ఒకటుంది. శంషాబాద్ మం. పరిధిలో 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించి, శ్రీ లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి ఏకశిల రాతి విగ్రహాలు నెలకొల్పారు. సీతమ్మవారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’అనే పేరు వచ్చిందని నానుడి. గర్భగుడిలో హనుమంతుడి విగ్రహం లేని అరుదైన రామ మందిరం ఇది. ఇక్కడి నుంచే రాముడు ఒంటిమిట్టకు వెళ్లినట్లు పెద్దలు చెబుతారు.
Similar News
News October 28, 2025
HYD: చీకటైనా పిల్లలు ఇంటికి రాలేదు.. పట్టించుకోరా?

యాచారం మం.లోని తాటిపర్తికి వెళ్లే బస్సు సకాలంలో రాకపోవడంతో బస్టాండ్లోనే విద్యార్థులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నిత్యం ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతోన్నా పాలకులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు గమ్యస్థానాలకు చేరేందుకు నానా అవస్థలు పడుతున్నారు. నేడు కొందరు లిఫ్ట్ అడిగి వెళ్లారు. మరికొందరు బస్టాండ్లో నిరీక్షించడం గమనార్హం. పాలకులకు పట్టవా? అన్న విమర్శలొస్తున్నాయి.
News October 28, 2025
ఆదిలాబాద్: ‘ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’

ANM, ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో ప్రతి గర్భిణిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లుల పోషకాహారం లోపం, గర్భధారణ సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, అనారోగ్య పరిస్థితుల్లో సమయానికి వైద్యసేవలు అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందన్నారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 28, 2025
తుఫాన్ ప్రభావంతో నేషనల్ హైవే 16పై వాహనాల నిలిపివేత

మొంథా తుఫాన్ ప్రభావంతో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత కోసం ఈరోజు రాత్రి 7 గంటల నుంచి నేషనల్ హైవే 16పై అన్ని వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో నిలిపివేయాలని సూచించారు. అత్యవసర సేవల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.


