News January 8, 2025

HYD: హామీలు అడిగినందుకు అక్రమ కేసులు: హరీష్ రావు

image

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. అడిగినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచాయని, ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలు డైరీలో ఉన్నాయని అన్నారు.

Similar News

News July 8, 2025

గాంధీ, ఉస్మానియాలపై దృష్టి సారించిన కలెక్టర్

image

గాంధీ ఉస్మానియా ఆస్పత్రులపై హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దృష్టి సారించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని వైద్య అధికారులను సూచించారు. కలెక్టరేట్లో ఉస్మానియా, గాంధీ ఆస్ప‌త్రుల వైద్యాధికారుల‌తో మెడిక‌ల్ కాలేజీల‌ మానిట‌రింగ్ క‌మీటి స‌మీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.

News July 7, 2025

బోనాల ఏర్పాట్లను పరిశీలించిన DCP రష్మీ పెరుమాళ్

image

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను ఈవో గుత్తా మనోహర్‌రెడ్డితో కలిసి DCP రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. ఆలయం లోపల క్యూ లైన్‌లను బోనాలతో వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. DCPతో పాటు ఏసీపీ సుబ్బయ్య, రామేశ్వర్, కృష్ణ, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

News July 7, 2025

క్రీడల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

image

కేంద్ర క్రీడలశాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండవీయను సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా, 40వ నేషనల్ గేమ్స్‌ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు తెలంగాణకు వచ్చేలా అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద శిక్షణ, వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు రైల్వే ఛార్జీల్లో రాయితీ మళ్లీ అందించాలని కోరారు.