News November 1, 2024
HYD: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో JOBS

HYDలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో (HAL)లో ఏవియానిక్స్ డివిజన్లో CMM ఇంజినీర్ 4, మిడిల్ స్పెషలిస్ట్ 8, జూ. స్పెషలిస్ట్ 5 పోస్టులను షార్ట్ టర్మ్ కింద భర్తీ చేస్తున్నారు. మొత్తం 17 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవాలి. SC, ST, PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు. దరఖాస్తుకు చివరి తేదీ: 24-11-2024
లింక్: https://hal-india.co.in/home
SHARE IT
Similar News
News October 16, 2025
మంత్రుల వ్యవహారంపై ఇన్ఛార్జి నటరాజన్ సీరియస్

మంత్రుల వ్యవహారంపై కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి నటరాజన్ సీరియస్ అయ్యారు. మంత్రుల మధ్య వరుస విభేదాలపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఆమె ఆరా తీశారు. సీఎం, మంత్రులపై కొండా సురేఖల కుమార్తె సుష్మిత చేసిన కామెంట్స్ ఎందుకు చేశారనే దానిపై ఇన్ఛార్జి ఆరా తీశారు.
News October 16, 2025
జూబ్లీ సాక్షిగా సర్కారుపై పోరుకు సిద్ధం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు 22 నెలల 9 రోజులైంది. ఈ లోపే పలువురు సర్కారుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేసి ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని బాధితులు బహిరంగంగా ప్రకటించారు. RRR, లగచర్ల భూసేకరణ, ఫార్మాసిటీ బాధితులు, గ్రూప్-1 అభ్యర్థులు, మాలసంఘాల నాయకులు నామినేషన్లు వేసి నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. వీరందరి పోరు ఎవరికి నష్టమో తెలియాలి.
News October 16, 2025
HYD: నామినేషన్ ఇప్పుడు పార్ట్ టైమ్ బిజినెస్

ఎన్నికలంటే ఎంతోమంది నామినేషన్లు వేయడం చూస్తుంటాం. వీరిలో కొందరు పేరు కోసం వేస్తే.. మరికొందరు స్వలాభం కోసం వేస్తారు. పేరుకోసం వేసేవారు తాను ఇన్నిసార్లు నామినేషన్ ఫైల్ చేశా అని చెప్పకోవడానికి, ఇంకొందరు ఓట్లు చీల్చడానికి స్వలాభంతో పోటీలో దిగుతారు. దీంతో గెలుపు అవకాశాలు కొందరికి తగ్గిపోతాయి. అందుకే గెలిచే అభ్యర్థి ఇచ్చే డబ్బుతో విత్ డ్రా చేసుకుంటారన్నమాట. ఇప్పుడుదే ట్రెండ్ర్ జూబ్లీలో కొనసాగుతోందా?