News March 30, 2025
HYD: హీరో ప్రభాస్ PRO పేరిట వార్నింగ్.. కేసు నమోదు

హీరో ప్రభాస్ PRO అంటూ తనకు కాల్ చేసి బెదిరించారని జూబ్లీహిల్స్ PSలో యూట్యూబర్ ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాలు.. మార్చి 4న విజయ్‌సాధు ప్రభాస్‌కు సర్జరీ అంటూ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఆ హీరో PROను అంటూ సురేశ్ అతడికి కాల్ చేసి వెంటనే డిలీట్ చేయాలని దూషించాడు. విజయ్‌సాధు వీడియో డిలీట్ చేయలేదు. దీంతో ప్రభాస్ అభిమానులకు సురేశ్ లింక్ పంపాడు. FANS సైతం వార్నింగ్ ఇవ్వడంతో విజయ్ పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News November 14, 2025
స్థానిక ఎన్నికలు BRSకు అగ్నిపరీక్షేనా!

TG: ‘జూబ్లీహిల్స్’ గెలుపు జోష్‌లో ఉన్న CONG అదే ఊపులో లోకల్ బాడీలనూ ఊడ్చేయాలని రెడీ అవుతోంది. త్వరలో రూరల్, అర్బన్ సంస్థల ఎలక్షన్స్ రానున్నాయి. ‘జూబ్లీ’ ఓటమితో నిరాశలో ఉన్న BRSకు ఇవి అగ్ని పరీక్షేనన్న చర్చ ఆ పార్టీలో నెలకొంది. ‘జూబ్లీ’ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడుతుందని, ఈ తరుణంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నాయకులు, శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపడం సవాలుగా మారుతుందని భావిస్తున్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుపై కూనంనేని హర్షం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ విజయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యావాదాలు తెలియజేశారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గ పరిధి అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో BJP అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయ్యిందన్నారు.
News November 14, 2025
మంత్రి పొన్నంను అభినందించిన సీఎం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందు నుంచి పని చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరిని కలుపుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్లారని సీఎం ఈ సందర్భంగా మంత్రి పొన్నంను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.


