News July 19, 2024
HYD: హుస్సేన్ సాగర్ నీటి మట్టం 513.21 మీటర్లు..!

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హుస్సేన్ సాగర్లో వర్షపునీరు చేరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం 513.21 మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు, రేపు భారీ వర్షాల నేపథ్యంలో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News January 3, 2026
HYDలో కొత్త ట్రెండ్.. ఇద్దరి మధ్య 2-2-2 Bonding

HYD బిజీ లైఫ్లో ప్రేమకు సమయం దొరకడం దంపతులకు కష్టమవుతోంది. వీరికి ‘2-2-2 రూల్’ కొత్త దారి చూపిస్తోందని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రతి 2 వారాలకు ఒక డేట్, 2 నెలలకు ఓ వీకెండ్ ట్రిప్, 2 ఏళ్లకు ఒక దీర్ఘ విహారం కలిసి చేయాలనే ఈ సూత్రం అనుబంధాన్ని బలపరుస్తుంది. కలిసి గడిపే సమయం పెరగడంతో భావోద్వేగ అనుబంధం బలపడుతుందనేది 2-2-2 సందేశం. చిన్న ప్రణాళికలతో పెద్ద మార్పు సాధ్యం అంటున్నారు.
News January 3, 2026
దద్దరిల్లనున్న హైదరాబాద్

సంక్రాంతి వస్తే సిటీలో పతంగ్ ఎగరాల్సిందే. గల్లీలో పెద్ద బిల్డింగ్ ఒక్కటి ఉంటే చాలు. చరాక్కు షాదీ, మాంజా చుట్టి బిల్డింగ్ ఎక్కాల్సిందే. ఆకాశంలో పోటీ పడుతోన్న గాలిపటాలు చూసిన ఆ క్షణం వైబ్ వేరు. పేంచ్లు వేస్తూ గాలిపటాలతో యుద్ధం చేస్తుంటారు. దోస్తులంతా కలిసి చేసుకునే దావత్ మామూలుగా ఉండదు. మందు, మాంసంతో బలగం చేసే సందడి జాతరను తలపిస్తుంది. ‘కాటే పతంగ్’ నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది.
News January 3, 2026
హైదరాబాద్లో కొత్త జిల్లా ఇదే?

ఏంది భయ్యా.. మన జిల్లా మారుతుందంట కదా?.. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. పరిపాలనను పరుగులు పెట్టించేందుకు GHMC ప్రాతిపదికన జిల్లాల రీ-ఆర్గనైజేషన్కు స్కెచ్ వేస్తోంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులను చెరిపేసి, ఆరు జోన్ల ఫార్ములాతో కొత్త రూపు ఇవ్వాలని చూస్తున్నారు. ఉప్పల్ను మల్కాజిగిరిలో కలిపి ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మీ కామెంట్?


