News April 8, 2025

HYD: హైకోర్టును ఆశ్రయించిన మన్నె క్రిశాంక్

image

HCU భూములపై AI వీడియోల విషయంలో తనపై నమోదైన కేసుల పట్ల బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై 4 FIRలు నమోదు చేశారని, రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించారు. దీంతో పిటిషన్‌పై తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేస్తూ.. పోలీసుల విచారణకు సహకరించాలని క్రిశాంక్‌ను హైకోర్టు ఆదేశించింది.

Similar News

News November 13, 2025

VKB: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి!

image

వికారాబాద్‌ జిల్లాలోని అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త. 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు) పొందడానికి వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి మాధవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

News November 13, 2025

కామారెడ్డి: ఈ ప్రాణాంతక డ్రైవింగ్‌కు అడ్డుకట్టే వేయరా?

image

సంగారెడ్డి-అకోలా జాతీయ రహదారిపై వాహన చోదకులు నిబంధనలను ఉల్లంఘిస్తూ అపసవ్య దిశలో ప్రయాణించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా ప్రయాణించే రహదారిపై వాహనదారులు అడ్డంగా రావడంతో ఇతరులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ అజాగ్రత్త కారణంగా ప్రాణనష్టం, గాయాలపాలవుతున్నారు. అధికారులు తక్షణమే దృష్టి సారించి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు కోరుతున్నారు.

News November 13, 2025

కృష్ణా: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు త్వరలో ఆన్‌లైన్ టెస్ట్.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగులు, మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్, ఆపై చదివిన 1.90 లక్షల మందికి పైగా నిరుద్యోగులను (NTRలో 1.30 లక్షలు, కృష్ణాలో 60 వేలు)గా గుర్తించారు. త్వరలో ఆయా కంపెనీల ప్రతినిధులే సచివాలయాల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. అభ్యర్థుల ప్రతిభ, అనుభవాన్ని బట్టి ప్యాకేజీలు ఉంటాయని అధికారులు తెలిపారు.