News February 19, 2025

HYD: హైడ్రాకు అదనపు కీలక బాధ్యతలు..!

image

హైడ్రా మరో కీలక బాధ్యతలను చేపట్టబోతుంది. ఇప్పటి వరకు చెరువులు చుట్టూ ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా, వాటి పరిరక్షణతో బాధ్యతలను సైతం చేపట్టబోతుంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇందుకు అవసరమైన నిధులను HMDA నుంచి కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 10 చెరువులను ఎంపిక చేసుకొని, పునర్నిర్మానం, అభివృద్ధిపై DPRలు సిద్ధం చేయించింది.

Similar News

News November 21, 2025

జగిత్యాల: సేకరణ సరే.. చెల్లింపుల్లో జాప్యమెందుకు..?

image

జగిత్యాల జిల్లాలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 14 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో మొన్నటి వరకు 4,311 మంది రైతుల నుంచి రూ.33.45 లక్షల విలువైన 1.39 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించారు. రైతుల నుంచి మొక్కజొన్నను సేకరించి 20రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే జమ అవుతాయని సంబంధిత అధికారులు అంటున్నారు.

News November 21, 2025

NZB: గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

రైలులో గుట్కా ప్యాకెట్లు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు NZB రైల్వే సీఐ సాయిరెడ్డి తెలిపారు. GRP, RPF సిబ్బంది కలసి ఫ్లాట్ ఫారం నంబర్-1పై తనిఖీలు చేస్తుండగా NZB ఆటోనగర్‌కు చెందిన అబ్దుల్ అనీస్ నిషేధిత టోబాకో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 80 ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

News November 21, 2025

ఖమ్మం: మధ్యాహ్న భోజన వ్యయం పెంపు

image

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుకింగ్‌ కాస్ట్‌’ను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ జీవో జారీ చేసింది. దీని ప్రకారం, ప్రాథమిక స్థాయి విద్యార్థికి ఖర్చు రూ.6.19 నుంచి రూ.6.78కి, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థికి రూ.11.79 నుంచి రూ.13.17కు పెరిగింది. హెచ్‌ఎంలు వెంటనే బిల్లులు పంపాలని ఆదేశించారు.