News October 1, 2024
HYD: హైడ్రాను రద్దు చెయ్యాలని హైకోర్టులో పిటిషన్
హైడ్రా జీవో నెంబర్ 99ను రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖాలు అయ్యాయి. పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, జీవో నెంబర్ 99ను వెంటనే రద్దు చేయాలను కోరుతూ పిటీషన్ దాఖలు కావడంతో దీని తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Similar News
News October 9, 2024
HYD: బస్సులు, రైళ్లు FULL.. వామ్మో కష్టమే..!
హనుమకొండ, వరంగల్, తొర్రూరు, ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు HYD నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాయంత్రం వేళ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కనీసం కూర్చునే పరిస్థితి లేదని ప్రయాణికులు వాపోయారు. రైళ్లలో వెళ్తున్న వారు ప్రతి స్టేషన్‌లో దిగి మళ్లీ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News October 9, 2024
ఖైరతాబాద్: సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై కమిషనర్ సమావేశం
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)ని ప్రవేశపెట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం 11 మంది ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు పెంచడానికి చురుకైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ఆపరేటర్లు అందించిన వినూత్న సాంకేతికతలను సమావేశంలో పరిశీలించారు.
News October 9, 2024
HYD: భర్త బయటపెట్టిన వీడియోలపై స్పందించిన దివ్యజ్యోతి
HYD మణికొండ డీఈఈ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె నిత్యం లంచం తీసుకుంటుందని పేర్కొంటూ.. నోట్ల కట్టలతో కూడిన వీడియోలను రిలీజ్ చేశారు. దీనిపై దివ్యజ్యోతి స్పందించారు. తాము గత సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని వెల్లడించింది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.