News September 4, 2024
HYD: హైడ్రా కమిషనర్ హెచ్చరిక

హైడ్రా పేరుతో బెదిరింపులు, వసూళ్లకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కొంతమంది బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైడ్రాలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నట్లు బెదిరిస్తున్నారని చెప్పారు. తమ విభాగాన్ని నీరు గార్చే ప్రయత్నాలు, తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇలా బెదిరిస్తే పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News October 15, 2025
RR: బ్యూటీషియన్ ఉచిత శిక్షణ.. కాల్ చేయండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిల్కూర్ డైరెక్టర్ ఎండీ.అలీఖాన్ Way2Newsతో తెలిపారు. బ్యూటీ పార్లర్ కోర్సులలో ఈనెల 21 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. 19- 45 లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్‌కార్డ్, కాస్ట్ సర్టిఫికెట్, 4 ఫొటోలతో ఈనెల 21లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 85001 65190 సంప్రదించాలన్నారు. SHARE IT.
News October 15, 2025
జూబ్లీహిల్స్‌లో 23 వేల కొత్త ఓట్లపై అనుమానం: BRS

జూబ్లీహిల్స్‌లో నకిలీ ఓట్ల వివాదం చిలిచిలికి గాలివానైంది. నకిలీ ఓట్ల విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా స్పందన లేదంటూ BRS సీరియస్ అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు మెట్లు ఎక్కాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ నియెజకవర్గంలో 23 వేల కొత్త ఓట్లు నమోదు కావడం అనుమానాస్పదమంటూ, దీనిపై చర్యలు తీసుకునేలా చేయాలని హైకోర్టును ఆశ్రయించనుంది.
News October 15, 2025
నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయనున్నారు. షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయబోతున్నారు. ఆమె వెంట కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు. సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 19న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బీఅర్ఎస్ సన్నాహాలు మొదలుపెట్టింది.