News December 25, 2024
HYD: హైడ్రా కీలక నిర్ణయం

హైడ్రాకు ఇప్పటికే దాదాపు 6 వేల ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 2025 కొత్త సంవత్సరంలో ప్రతి సోమవారం ట్యాంక్బండ్ బుద్ధభవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తామని ప్రకటించారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 వరకు తాను అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తానన్నారు. ఒకవేళ అందుబాటులో లేకపోతే 7207923085కు వివరాలు పంపొచ్చని తెలిపారు.SHARE IT
Similar News
News November 12, 2025
FLASH: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈరోజు అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడు సలీంను (DRI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో అతడి బ్యాగులో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, సలీంను అదుపులోకి తీసుకున్న అధికారులు, నిషేధిత వస్తువులను సీజ్ చేశారు.
News November 12, 2025
HYD: కాంగ్రెస్ నేతల ముందస్తు సంబరాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు ప్రకటించక ముందే కాంగ్రెస్ విజయంపై సంబరాలు మొదలయ్యాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేయడంతో రాత్రి నుంచి నేతలు విజయోత్సవాలను జరుపుతున్నారు. విజయానికి కృషి చేశారంటూ కమ్మ సంఘాల సమితికి ధన్యవాద సభ పేరిట సమాఖ్య అధ్యక్షుడు B.రవిశంకర్, సభ్యులు ఈరోజు HYDలో సమావేశం నిర్వహిస్తున్నారు. కమ్మ ఓట్లను ఏకం చేయడంలో మంత్రి తుమ్మల కీలక పాత్ర పోషించారని తెలిసింది.
News November 12, 2025
HYD: రెండేళ్లలో 400 క్యాన్సర్ రోబోటిక్ సర్జరీలు..!

HYD MNJ క్యాన్సర్ ఆస్పత్రి మరో ఘనత సాధించింది. క్యాన్సర్ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాల్లో ఏకంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రోబోటిక్ సర్జరీల ద్వారా అతి సులువుగా, రోగికి ఇబ్బంది లేకుండా శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా వైద్య బృందం వెల్లడించింది. MNJ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు వరంగా మారుతోంది.


