News April 8, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 57 ఫిర్యాదులు

HYDలోని హైడ్రా కార్యాలయంలో ఈరోజు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో భాగంగా 57 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తైతే చాలా సమస్యలకు పరిష్కారం దొరకుతుందని, ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News November 26, 2025
iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.
News November 26, 2025
స్టేట్ ఛాంపియన్స్గా ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు

మదనపల్లి హైస్కూల్లో నవంబర్ 24, 25, 26 తేదీలలో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి SGFI అండర్-14 బాస్కెట్బాల్ టోర్నమెంట్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలికల జట్టు రాష్ట్ర ఛాంపియన్గా నిలిచింది. బుధవారం నూజివీడులో సీనియర్ పీడీ వాకా నాగరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. బాలుర జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుందని తెలిపారు. విజేతలైన బాలబాలికలను ఆయన అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలన్నారు.
News November 26, 2025
సిరిసిల్ల: ‘అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం’

అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామని బెటాలియన్ అసిస్టెంట్ కమాండెడ్ రామదాసు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్ లో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ.. మన దేశ రాజ్యాంగానికి నేటి రోజున ఆమోద ముద్ర పడిందన్నారు. రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని గుర్తు చేశారు.


