News September 11, 2024
HYD: ‘హైడ్రా ప్రణాళిక సిద్ధం చేసేందుకు కసరత్తు’
HYDలో హైడ్రా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, లేటెస్ట్ హిస్టారికల్ సాటిలైట్ డేటాపై చర్చలు జరిపారు. ఏరియల్ సర్వీస్, డిజిటల్ మ్యాపింగ్ హైడ్రాకు ఖచ్చితమైన విశ్లేషణ, ప్రణాళిక చేసేందుకు అవసరమని తెలిపారు. వాతావరణాన్ని అంచనా వేయడం, నీటి వనరులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
Similar News
News October 8, 2024
HYD: రూ.1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్
తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ.1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్‌ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్‌కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.
News October 7, 2024
HYD: యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!
HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్ PS పరిధిలో <<14294955>> రోడ్డు ప్రమాదంలో<<>> చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా బాషా (కుడి) TGRTCలో అసిస్టెంట్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.
News October 7, 2024
HYD: కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం
భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయనను ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి ఐపీఎస్‌ల కేటాయింపు వంటి పలు అంశాలపై చర్చించి, సహకరించాలని కోరారు.