News March 15, 2025
HYD: హోలీ ఈవెంట్‌లో గొడవ.. యువకుడిపై కత్తిపోట్లు

పోచారం ఐటీ కారిడార్‌లో జరిగిన గొడవ దాడికి దారితీసింది. బాధితుడి వివరాలిలా.. హొలీ ఈవెంట్‌లో ఉప్పు ఆదిత్య అనే యువకుడితో కొంతమందికి గొడవ జరిగింది. అనంతరం అతను బొడుప్పల్ వెళ్తూ నారపల్లి వద్ద ఆగాడు. బైక్‌పై వచ్చిన యువకులు కత్తితో దాడి చేశారు. అతణ్ని ఉప్పల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News January 1, 2026
యూరియా నిల్వలు పుష్కలం: మంత్రి తుమ్మల

ఖమ్మం: యూరియా కొరత లేదని, 2 లక్షల టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 4 లక్షల టన్నులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులు ఎరువుల కోసం తెల్లవారుజామునే చలిలో క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తోంది.
News January 1, 2026
‘జగిత్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి’

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని, అదే ఉత్సాహంతో 2026లోనూ పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఆరోగ్యంపై శ్రద్ధ, యోగ, వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు.
News January 1, 2026
నావల్ డాక్‌యార్డ్‌లో 320 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో 320 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల వారు NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV) ద్వారా ఎంపిక చేస్తారు. MARCH 22న రాత పరీక్ష నిర్వహించి, 25న ఫలితాలు వెల్లడిస్తారు. DV మార్చి 30న, మెడికల్ టెస్ట్ మార్చి 31 న నిర్వహిస్తారు. https://indiannavy.gov.in


