News March 15, 2025
HYD: హోలీ ఈవెంట్‌లో గొడవ.. యువకుడిపై కత్తిపోట్లు

పోచారం ఐటీ కారిడార్‌లో జరిగిన గొడవ దాడికి దారితీసింది. బాధితుడి వివరాలిలా.. హొలీ ఈవెంట్‌లో ఉప్పు ఆదిత్య అనే యువకుడితో కొంతమందికి గొడవ జరిగింది. అనంతరం అతను బొడుప్పల్ వెళ్తూ నారపల్లి వద్ద ఆగాడు. బైక్‌పై వచ్చిన యువకులు కత్తితో దాడి చేశారు. అతణ్ని ఉప్పల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News April 23, 2025
సివిల్స్‌లో వెల్దండ యశ్వంత్‌కు 432వ ర్యాంకు

వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించాడు. గత సంవత్సరం సివిల్స్ రాయగా 627వ ర్యాంకు సాధించిన యశ్వంత్ ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు. తిరిగి పరీక్ష రాయగా ఈసారి మంచి ర్యాంక్ సాధించాడని తల్లిదండ్రులు ఉమాపతి నాయక్, పద్మ సంతోషం వ్యక్తం చేశారు. యశ్వంత్‌ను కుటంబీకులు, మిత్రులు అభినందించారు.
News April 23, 2025
హయత్‌నగర్: హిజ్రాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాత్రి వేళలో ఔటర్ రింగ్ రోడ్ల వెంట ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మెట్ తహశీల్దార్‌కు బైండ్ ఓవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజుగౌడ్ మాట్లాడుతూ.. ఎవరైనా రోడ్ల వెంట అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినా, వచ్చి పోయేవారికి, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 23, 2025
HYD: ‘డ్రగ్స్‌కు నో… భవిష్యత్తుకు అవును చెప్పండి’

రాచకొండ CPసుధీర్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు మత్తుపదార్థాల విపత్తుపై యువతలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. ‘మీరు ముగించడానికి పుట్టలేదు…ప్రారంభించేందుకు పుట్టారు’ అనే శక్తివంతమైన సందేశంతో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఉత్తమ భవిష్యత్తు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.”డ్రగ్స్‌కు నో చెప్పండి…మీ భవిష్యత్తుకు అవును చెప్పండి” నినాదంతో యువతలో మార్పు తీసుకురావాలని పోలీసులు ఆకాంక్షించారు.