News March 13, 2025

HYD: హోలీ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు: సీపీ

image

హోలీ నేపథ్యంలో HYDలో ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 గం. నుంచి శనివారం ఉదయం 6 గం. వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వైన్సులతో సహా.. గ్రేటర్ పరిధిలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలుంటాయని ఆదేశించారు. రోడ్లపై వెళ్లే వారిపై అకారణంగా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

Similar News

News October 19, 2025

వైసీపీ NTR జిల్లా అధికార ప్రతినిధిగా గుంజ శ్రీనివాసు

image

వైసీపీ NTR జిల్లా అధికార ప్రతినిధిగా కొండపల్లి మున్సిపాలిటీ వైసీపీ ఫ్లోర్ లీడర్ గుంజ శ్రీనివాసు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి, వైసీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేశ్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ సిఫార్సుల మేరకు వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఈ నియామకం జరిగినట్లు పేర్కొన్నారు.

News October 19, 2025

పోలవరంలో అత్యధిక వర్షపాతం నమోదు

image

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా పోలవరంలో 104.6 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా పెదవేగిలో 4.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లి 101.2, బుట్టాయిగూడెం 85.4, ఏలూరు 84.8, జంగారెడ్డిగూడెం 80.4, నిడమర్రు 80.2, కొయ్యలగూడెం 79.8, ద్వారకాతిరుమల 73.0, భీమడోలు 49.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.

News October 19, 2025

గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

image

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.