News March 14, 2025

HYD: హోలీ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత: సీపీ

image

35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన  ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు. 

Similar News

News March 22, 2025

HYD: ప్రియుడి సూచన.. NTR స్టేడియంలో దారుణం

image

NTR స్టేడియంలో పసిపాపను కాల్చివేసిన ఘటనలో మైనర్ బాలుడిని దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. కవాడిగూడకు చెందిన మైనర్ బాలిక, నల్గొండ జిల్లాకు చెందిన బాలుడు ప్రేమించుకుంటున్నారు. శారీరకంగానూ ఒక్కటి అవ్వడంతో బాలిక గర్భం దాల్చింది. నెలలు నిండక ముందే డెలివరీ కావటంతో పుట్టుకతోనే పాప చనిపోయింది. ప్రియుడి సూచన మేరకు NTR స్టేడియంలో మృతశిశువును బాలిక కాల్చివేసింది. పోలీసులు బాలుడిని జువైనల్‌కి తరలించారు.

News March 22, 2025

HYD: పదోన్నతి.. ఇంతలోనే అడిషనల్ DCP మృతి

image

హయత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అడిషనల్ DCP బాబ్జీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పోలీస్ సిబ్బంది తీవ్ర సంతాపం ప్రకటించింది. మార్చి 18న ఆయన అడిషనల్ SP ర్యాంక్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఇంతలోనే మృతి చెందడం కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద అంబర్‌పేటలో నివాసం ఉండే బాబ్జీ‌కి ఉదయం వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే హైవే మీద రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది.

News March 22, 2025

HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

image

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్‌ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!