News November 15, 2024
HYD: హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. కాగా, లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి ఘటనలో భాగంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News September 16, 2025
HYD: పూడిక తీయండి.. సమస్య తీర్చండి!

నగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి చాలాచోట్ల వరదనీరు నిలిచిపోతోంది. కారణం ఆయా ప్రాంతాల్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడమే. ఇలాంటి 40 ప్రాంతాలను హైడ్రా గుర్తించింది. అక్కడ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను యుద్ధప్రాతిపదికన తొలగించడానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నడుంబిగించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పూడిక తొలగిస్తే వరదనీటి సమస్యకు పరిష్కారం లభించినట్లవుతుంది.
News September 16, 2025
MGBS మెట్రో స్టేషన్లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రం

దేశంలోనే పాస్‌పోర్ట్ జారీలో 5వ స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో నూతన పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని MP అసదుద్దీన్ ఒవైసీ, MP అనిల్ కుమార్ యాదవ్, MLC రియాజుల్ హసన్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలసి మంత్రి ప్రారంభించారు. దేశంలోనే మొదటిసారి మెట్రోలో ప్రారంభమైన పాస్ పోర్ట్ కేంద్రం ఇదే అని ఆయన వెల్లడించారు.
News September 16, 2025
HYD: నాన్న.. నీవెక్కడ?

నాన్న రాక కోసం ఆ బాలుడు ఎదురుచూపులు ఆపడం లేదు. గుండెకు హత్తుకొని లాలించే తండ్రి కనిపించక చిన్నోడు వెక్కివెక్కి ఏడుస్తోండు. వరదలో గల్లంతైన కొడుకు కోసం తల్లి, భర్త జాడెక్కడా? అని భార్య కన్నీరుపెట్టుకుంటోంది. వినోభానగర్‌లో వరదల్లో కొట్టుకుపోయిన సన్నీ ఫ్యామిలీ విషాద గాథ ఇది. వరదల్లో కొట్టుకుపోయిన అతడి ఆనవాళ్లు 40 గంటలైనా తెలియలేదు. ఆకలి, దూప వదిలి కుటుంబీకులు నాలాల వద్ద పడిగాపులు కాయడం బాధాకరం.