News March 14, 2025

HYD: అంగన్‌వాడీలకు సెలవు లేదు

image

హోలీ సందర్భంగా ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. అయితే, అంగన్‌వాడీ ఉద్యోగినులు మాత్రం దీనికి మినహాయింపు. పండుగ రోజున కూడా విధులు నిర్వర్తించాల్సి రావడం వారిలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. కుటుంబంతో హోలీ జరుపుకునే అవకాశాన్ని దూరం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాన హక్కులు కల్పించాలని, ప్రభుత్వ వైఖరి మారాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News December 18, 2025

పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు

image

భారత పౌరసత్వాన్ని వదులుకుని విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు పౌరసత్వం వదులుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. 2022 నుంచి ఏడాదికి 2లక్షలకు పైగా భారతీయులు దేశాన్ని వీడారు. వీరిలో సంపన్నులు, నిపుణులు, మేధావులు ఎక్కువగా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ప్రపంచంలోనే అత్యధిక పౌరులను కోల్పోతున్న దేశాల్లో భారత్ టాప్‌లో కొనసాగుతోంది.

News December 18, 2025

మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్: లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పాలనా సంస్కరణలు నినాదాలను మించినవైతే గుర్తింపు తప్పకుండా వస్తుంది. అత్యంత గౌరవనీయమైన అవార్డు.. బలమైన జ్యూరీ. అది ఏ అవార్డు? ఎవరు గెలుచుకున్నారో ఊహించండి. మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్’ అని పేర్కొన్నారు. CM చంద్రబాబుకు ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గురించే లోకేశ్ చెబుతున్నారని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

News December 18, 2025

విజయవాడలో వల్లభనేని వంశీపై మరో కేసు

image

విజయవాడలో వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 జులైలో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులు తనపై దాడి చేశారని సునీల్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి వల్లభనేని వంశీ సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.