News May 12, 2024

HYD: అందరూ ఓటేయాలంటూ వినూత్నంగా అవగాహన

image

ప్రజలకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మేడ్చల్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త తారక్ HYDలోని ప్రధాన మార్గాలు, గల్లీగల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 250 కిలోమీటర్లు తన ద్విచక్ర వాహనంపై తిరుగుతూ తన భుజానికి వేసుకున్న బ్యాగ్ పై Vote is Voice #IVOTEFORSURE అని ఓ స్టిక్కర్ అతికించుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. 

Similar News

News October 8, 2024

HYDRAపై రేపు MLA KVR ప్రెస్‌మీట్

image

HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.

News October 8, 2024

HYD: వీడియోలో ఏం తప్పుందో చెప్పాలి: హరీశ్‌రావు

image

జర్నలిస్టు గౌతమ్ వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గౌతమ్ షేర్ చేసిన వీడియోలో తప్పేముందో చెప్పాలని ఆయన X ద్వారా డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనలు, బాధలను తెలిపితే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ తెలంగాణ డీజీపీని ఆయన ప్రశ్నించారు.

News October 8, 2024

రైల్వేలో JOBS.. సికింద్రాబాద్‌‌లో 478 పోస్టులు

image

దేశవ్యాప్తంగా 8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగం చేయాలనుకునేవారికి అప్లై చేసేందుకు మరో 5 రోజులే గడువు ఉంది. అక్టోబర్‌ 13వ తేదీన అప్లికేషన్‌ గడువు ముగియనుంది. కేవలం మన సికింద్రాబాద్‌(SCR) రీజియన్‌లోనే 478 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇంగ్లిష్, హిందీ టైపింగ్, కంప్యూటర్‌పై అవగాహన ఉండాలి. ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చు.
SHARE IT