News December 29, 2025
HYD: అందులో మన జిల్లానే టాప్

తెలంగాణలో HYDలో అత్యధికంగా 4.82 లక్షల MSME పరిశ్రమలు ఉన్నట్లు MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల సంఖ్యలో రంగారెడ్డి జిల్లా 2.84 లక్షలతో రెండో స్థానంలో నిలవగా మేడ్చల్ జిల్లా 2.24 లక్షలతో మూడో స్థానం సాధించింది. MSME రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారిందని అన్నారు. ఉపాధి కల్పనలోనూ, రాష్ట్ర జీడీపీలోనూ ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
యూరియా కోసం క్యూలో ఉండక్కర్లేదు: అదనపు కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ శిక్షణలో మాట్లాడుతూ.. సాంకేతికతతో పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద 3 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఉదయం 6 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 30, 2025
సంగారెడ్డి జిల్లా ఎస్పీ WARNING

ఈనెల 31 సాయంత్రం తర్వాత ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలుకు పంపిస్తామని ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం హెచ్చరించారు. కొత్త సంవత్సరం పేరుతో ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. నూతన సంవత్సరం వేడుకలకు డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టం వినిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
News December 30, 2025
కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు కట్టడి ఎలా?

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.


