News December 29, 2025

HYD: అందులో మన జిల్లానే టాప్

image

తెలంగాణలో HYDలో అత్యధికంగా 4.82 లక్షల MSME పరిశ్రమలు ఉన్నట్లు MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల సంఖ్యలో రంగారెడ్డి జిల్లా 2.84 లక్షలతో రెండో స్థానంలో నిలవగా మేడ్చల్ జిల్లా 2.24 లక్షలతో మూడో స్థానం సాధించింది. MSME రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారిందని అన్నారు. ఉపాధి కల్పనలోనూ, రాష్ట్ర జీడీపీలోనూ ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

Similar News

News December 31, 2025

HYD: రాత్రి 7 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

image

నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో కఠిన భద్రతా చర్యలు అమల్లోకి వచ్చాయి. ఈవెంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందని CP సజ్జనార్ స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు తప్పదని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతతో కొత్త ఏడాదిని జరుపుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News December 31, 2025

31st నైట్ HYDలో ఈ రూట్లు బంద్

image

New Year వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈరోజు రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, PV మార్గ్, పలు ఫ్లైఓవర్‌లను పూర్తిగా నిలిపివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

News December 31, 2025

HYD: ఈ చేపలు తింటే ముప్పు

image

మేడ్చల్‌ (D) ఎదులాబాద్‌ నీటి రిజర్వాయర్‌ కాలుష్యంతో తీవ్రంగా కలుషితమవుతోంది. ఇందులోని చేపలు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. తక్కువ ధర, అధిక ప్రోటీన్‌ అనే కారణాలతో ప్రజలు విస్తృతంగా తినే పొలుసులు చేపల్లో విషం దాగి ఉంది. సీసం, క్రోమియం, నికెల్‌, కాడ్మియం వంటి భార లోహాలు పేరుకుపోయినట్లు TG SSC జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోనే స్పష్టంగా పేర్కొన్నారు. దీర్ఘ కాలంలో కాలేయం, కిడ్నీ, నరాలపై ప్రభావం చూపనుంది.