News December 24, 2025

HYD: అందెశ్రీ సమాధికి ఏంటీ గతి?

image

రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియల వేళ ఇచ్చిన ప్రభుత్వ హామీలు నీటి మూటలయ్యాయి. ఆయన మరణించినప్పుడు స్వయంగా పాడె మోసిన సీఎం రేవంత్‌ రెడ్డి.. అక్కడ ‘స్మృతివనం’నిర్మిస్తామని ప్రకటించారు. కానీ నేడు ఘాట్‌కేసర్‌లోని ఆయన సమాధి కనీసం గుర్తుపట్టలేని స్థితిలో దర్శనమిస్తోంది. “జయ జయహే తెలంగాణ” అంటూ జాతిని మేల్కొల్పిన కవికి దక్కుతున్న గౌరవం ఇదేనా అని సాహితీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 26, 2025

‘వైరల్ హెరిటేజ్’ అడ్డాగా హైదరాబాద్

image

HYD హిస్టరీని యూత్ డిజిటల్ దునియాలో కింగ్‌ను చేసింది. 2025 యూట్యూబ్ ట్రెండ్స్ ప్రకారం.. గోల్కొండ సన్‌రైజ్ సెల్ఫీలు, చార్మినార్ AR ఫిల్టర్లు నెలకు 5 లక్షల షేర్లతో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలూ పాత కోటల చుట్టూ సినిమాటిక్ రీల్స్ చేస్తూ మన వారసత్వాన్ని గ్లోబల్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. ‘హెరిటేజ్ వైబ్’‌కు SMలో క్రేజ్‌ ఎక్కువైంది. ‘Beautiful Views@Golconda, Charminar’ క్యాప్షన్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

News December 26, 2025

గ్రేటర్ నయా రూపం ఇదే!

image

GHMC తాజా అధికారిక మ్యాప్ చూస్తుంటే సీన్ అర్థమవుతోంది. పాత వార్డుల లెక్కలకు చెల్లుచీటి రాస్తూ సరిహద్దుల పునర్విభజనతో సిటీ మ్యాప్ కొత్తగా మెరుస్తోంది. జనాభా పెరిగిన చోట వార్డులను ముక్కలు చేసి, పరిపాలన గల్లీ స్థాయికి చేరేలా స్కెచ్ వేశారు. శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్, కుత్బుల్లాపూర్ నుంచి రాజేంద్రనగర్ వరకు పెరిగిన కాలనీలన్నీ ఇప్పుడు సరికొత్త సర్కిళ్లలోకి చేరాయి. మ్యాప్‌లో జోన్‌ల సరిహద్దులు మారాయి.

News December 26, 2025

HYDలో తొలిసారిగా రిమోట్ కంట్రోల్డ్ రూఫ్!

image

పాతబస్తీలోని అలావా-ఏ-బీబీ వద్ద దేశంలోనే అరుదైన, సిటీలో మొట్టమొదటి ‘రిమోట్ కంట్రోల్డ్ రిట్రాక్టబుల్ రూఫ్’ రాబోతోంది. సుమారు రూ.1.20 కోట్లతో GHMC ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. మొహర్రం వేడుకలప్పుడు ఎండ, వానల వల్ల భక్తులు పడే ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. ఒకే ఒక్క రిమోట్ బటన్‌తో 4,844 చదరపు అడుగుల భారీ పైకప్పు క్షణాల్లో తెరుచుకుంటుంది లేదా మూసుకుంటుంది. సిటీలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి.