News April 7, 2025

HYD: అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ నేతల పుష్పాంజలి

image

బీజేపీ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, సీ.అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల, NVSS ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు సోమవారం ట్యాంక్‌బండ్ కూడలి వద్ద డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా శాసనమండలికి బయలుదేరారు.

Similar News

News April 12, 2025

HYD: నేడు మద్యం దుకాణాలు బంద్

image

హనుమాన్ జయంతి సందర్భంగా జంట నగరాలు.. HYD, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలను మూసేయాలని పోలీసు శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కల్లు కాంపౌండ్లు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉండే బార్లను బంద్ చేయాలని సూచించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News April 12, 2025

GHMC రికార్డు.. భారీగా TAX వసూళ్లు

image

TAX వసూళ్లలో GHMC రికార్డు సృష్టించింది. బల్దియా చరిత్రలో తొలిసారి రూ.2 వేల కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు అయ్యిందని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పని చేశారన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు శుక్రవారం బంజారాభవన్‌లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. OTS పథకంతో మంచి ఫలితాలు వచ్చాయని, 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.2,038 కోట్లకుపైగా వసూలయ్యాయని కమిషనర్ స్పష్టం చేశారు.

News April 11, 2025

HYDలో రూట్ మ్యాప్ విడుదల

image

రేపు శ్రీ వీర్ హనుమాన్ విజయయాత్ర జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్‌ విడుదల చేశారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు 12 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుందని స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. యాత్ర మార్గాల్లో ట్రాఫిక్ రద్దీకి అవకాశముండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ అధికారులు విజ్ఞప్తి చేశారు. 

error: Content is protected !!