News August 16, 2025

HYD: అదుపుతప్పిన వాహనం.. కిందపడిపోయిన విగ్రహం

image

ఆరాంఘర్‌ శివారు మార్గంలో శనివారం రోడ్డుపై గణేశ్ విగ్రహం పడిపోయింది. వాహనం అదుపుతప్పి విగ్రహం ఒకేవైపు ఒరిగి, కిందపడిపోయినట్లు వాహనదారులు తెలిపారు. రోడ్డుకు అడ్డుగా భారీ ప్రతిమ పడిపోవడంతో ఆ రూట్‌లో ట్రాఫిక్ జామైంది. పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. మండపానికి తీసుకెళ్తుంటే ఊహించని సంఘటన ఎదురైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News August 17, 2025

NZB: ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

NZB నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందారు. దీంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టాయి. ఆర్మూర్‌కు చెందిన సాయికుమార్(26) రోడ్డు ప్రమాదంలో గాయపడగా చేతికి కాలుకు గాయమైందని చెప్పి హాస్పిటల్ వర్గాలు చేర్చుకుని ట్రీట్మెంట్ ప్రారంభించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యం చేస్తుండగా సాయికుమార్ మరణించాడని తెలపడంతో బంధువులు ఆందోళన చేపట్టారు.

News August 17, 2025

మంథనిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు

image

మంథని పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తి ఉత్సావాల మధ్య శనివారం ఘనంగా జరిగాయి. రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ, కోదండరామాలయాల్లో వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిగి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. “కృష్ణుడు అవతరించింది చెడును అంతమొందించి ధర్మాన్ని స్థాపించేందుకే” అని భక్తులు పేర్కొన్నారు. చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో పాల్గొని కనువిందు చేయగా, పట్టణం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

News August 17, 2025

తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన ఎస్పీ

image

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు క్యూలైన్ల వద్దకు చేరుకుని క్యూలైన్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.