News April 3, 2024

HYD: అద్దె కార్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

లాంగ్ డ్రైవ్‌లో అద్దెకు కార్లు తీసుకొని వాటిని అమ్ముతున్న ముఠాను HYD మాదాపూర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో ఉంటున్న హరీశ్ కుందారపు అనే వ్యక్తికి, సదరు వ్యక్తులు కార్లు ఇవ్వడంతో వీరికి కొంత కమిషన్ రూపంలో హరీశ్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6 కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 18, 2025

JNTU: కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఇంటర్వ్యూ

image

JNTU అఫిలియేటెడ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి అఫిలియేటెడ్ ఆడిట్ సెల్ డైరెక్టర్ తారా కళ్యాణి ఆధ్వర్యంలో వర్సిటీలో ఫ్యాకల్టీలకు ఇంటర్వ్యూలో నిర్వహించారు. ఈనెల 17వ తేదీ నుంచి 20 వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయని వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ బాలకిష్టారెడ్డి తెలిపారు. రసాయన, ఆంగ్ల, గణిత శాస్త్ర విభాగానికి సంబంధించి అభ్యర్థులకు వీసీ ఇంటర్వ్యూ నిర్వహించారు. 

News January 18, 2025

HYD: ఇంటర్ విద్యార్థుల ALERT.. ఈనెల 25 వరకు అవకాశం

image

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌ను ఇంటర్మీడియ‌ట్ బోర్డు అప్ర‌మ‌త్తం చేసింది. వార్షిక ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజును ఇప్ప‌టికీ చెల్లించ‌ని విద్యార్థులు.. ఆల‌స్య రుసుం రూ. 2500తో జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఇంట‌ర్ రెగ్యుల‌ర్, వొకేష‌న‌ల్ విద్యార్థుల‌తో పాటు ప్రైవేటు విద్యార్థులు కూడా ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించింది.

News January 18, 2025

HYD: రాష్ట్రంలో రేవంత్ దోపీడీ ముఠా: కేటీఆర్

image

రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్‌లో చిట్ చాట్‌లో KTR మాట్లాడుతూ.. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురి టీం కంపెనీల నుంచి వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని అన్నారు. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణలో తిరుగుతుందని అన్నారు.