News August 15, 2025
HYD: అద్భుత రూపంలో శ్రీదుర్గాదేవి అమ్మవారు

HYD ఎల్బీనగర్ పరిధి మన్సూరాబాద్ డివిజన్ శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారికి ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం వేళ అమ్మవారిని గాజులతో అలంకరించారు. నిమ్మకాయల దండ వేశారు. అమ్మవారు భక్తులకు అద్భుతంగా దర్శనమిచ్చారు. మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే వచ్చి దర్శించుకుంటున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ పోచబోయిన గణేశ్ యాదవ్ తెలిపారు.
Similar News
News August 16, 2025
HYD: కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు కధీరవన్ పళని, జి.ముకుంద రెడ్డి, డీఆర్ఓ ఈ.వెంకటాచారితో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి స్వీకరించారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
News August 16, 2025
HYD: కోకాపేట్‌లో యాక్సిడెంట్.. మహిళ మృతి

HYD కోకాపేట్ పరిధిలోని పోలువామి 90 విలాస్ ముందు ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రోడ్డు దాటుతున్న సమయంలో టాండాల మంజుల(44) అనే మహిళను దత్తుచంద్ర అనే వ్యక్తి బుల్లెట్ బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది. మంజుల గాంట్లకుంట పరిధి కన్వాయిగూడెం తండాకు చెందిన మహిళ అనే నార్సింగి పోలీసులు తెలిపారు.
News August 15, 2025
ఆ కష్టాలు మళ్లీ రాకుండా GHMC ముందు జాగ్రత్త..!

2020, 2023లో భారీ వర్షాల కారణంగా గ్రేటర్ HYD పరిధిలోని పలు చెరువులు నిండి కట్టలు తెగి బస్తీలు, కాలనీల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ఆ సమస్య ఉత్పన్నం కాకుండా గ్రేటర్ అధికారులు చెరువుల ఎఫ్టీఎల్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎఫ్టీఎల్‌కు రెండు అడుగుల తక్కువగానే నీరుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్‌కు దగ్గరగా నీటి మట్టం పెరిగితే నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.