News April 1, 2024
HYD: ‘అధిక ధరలు వసూలు చేస్తే.. ఫిర్యాదు చేయండి’
గ్రేటర్ HYDలో గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ తెలిపారు. గ్యాస్ డోర్ డెలివరీ ఆలస్యం చేయడంతో వినియోగదారులే డీలర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైల్ ధరకు రూ.1 అధికంగా అడిగినా అక్కడే నిలదీయాలని, వినకుంటే తమకు Xలో ఫిర్యాదు చేసినా స్పందిస్తామన్నారు.
Similar News
News January 14, 2025
HYDలో గణనీయంగా తగ్గిన విద్యుత్ వాడకం
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెటూర్లకు తరలివెళ్లారు. దీంతో గృహాలతో పాటు కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. ఉత్పత్తులు, రోజువారి కార్యకలాపాలు నిలిచిపోవడంతో వినియోగం గణనీయంగా తగ్గింది. సోమవారం 2,500 మెగావాట్లకు పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే 700 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారలు తెలిపారు.
News January 14, 2025
HYD: అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం: హరీశ్
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. బెయిలబుల్ సెక్షన్స్‌లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పండగపూట డెకాయిట్‌ని, టెర్రరిస్ట్‌ని అరెస్టు చేసినట్లు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
News January 14, 2025
రంగారెడ్డి జిల్లాలో నమోదు అవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాచులూరు, ఎలిమినేడులో 13.1℃, రెడ్డిపల్లె 13.3, మీర్‌ఖాన్‌పేట 13.5, చందనవెల్లి 13.6, తాళ్లపల్లి, అమీర్‌పేట, మంగళపల్లె 13.7, వైట్‌గోల్డ్ SS, కేతిరెడ్డిపల్లి 13.9, కందువాడ 14, షాబాద్ 14.3, రాజేంద్రనగర్, గునగల్ 14.4, కొత్తూరు 14.5, ప్రొద్దుటూరు, యాచారం, తొమ్మిదిరేకుల, ఆరుట్ల 14.6, కాసులాబాద్, నందిగామలో 14.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.