News July 7, 2025
HYD: అన్ని రోడ్లు ఇలా చేస్తే ఎంత బాగుండో.!

HYD శివారు గౌలిదొడ్డి ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా గుంతల మయంగా మారింది. వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. స్థానికులు, ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించారు. దీంతో HYD నగర వ్యాప్తంగా అన్ని రోడ్లలో ఇలా చేస్తే ఎంత బాగుండోనని అంటూ X వేదికగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
Similar News
News July 7, 2025
ఆర్కిటెక్చర్ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేదు?: షర్మిల

AP: YSR ఆర్కిటెక్చర్ & ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యను కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని APCC చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ‘కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతుల కోసం స్టూడెంట్స్ ఏడాదిగా పోరాటం చేస్తున్నారు. జగన్, అవినాశ్ అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. గత ప్రభుత్వ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి సర్కార్‌కు లేదా? సర్టిఫికెట్లు లేకుంటే విద్యార్థుల జీవితాలేమవ్వాలి?’ అని మండిపడ్డారు.
News July 7, 2025
SMలో విమర్శలతో డిజైన్ మార్చేశారు!

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా APR నెలలో బిహార్ ప్రభుత్వం రూ.40 లక్షల వ్యయంతో బిహార్ షరీఫ్‌లో ‘క్లాక్ టవర్’ నిర్మించిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర <<16018209>>విమర్శలు<<>> రావడంతో ఈ డ్యామేజీని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వం సదరు టవర్‌ను కూల్చేసింది. దాని స్థానంలోనే సరికొత్త మోడల్ క్లాక్ టవర్‌ను నిర్మిస్తోంది. ఈ భయమేదో ముందే ఉంటే ప్రజాధనం వృథా అవ్వకపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
News July 7, 2025
ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేత: కలెక్టర్

‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి, వారి తల్లి పేరున పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఇందుకోసం ‘లీప్ యాప్’ను రూపొందించి, అందులో విద్యార్థులు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.