News July 7, 2025

HYD: అన్ని రోడ్లు ఇలా చేస్తే ఎంత బాగుండో.!

image

HYD శివారు గౌలిదొడ్డి ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా గుంతల మయంగా మారింది. వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. స్థానికులు, ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించారు. దీంతో HYD నగర వ్యాప్తంగా అన్ని రోడ్లలో ఇలా చేస్తే ఎంత బాగుండోనని అంటూ X వేదికగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Similar News

News July 7, 2025

కాచిగూడ- యశ్వంత్‌పుర వందేభారత్ కోచ్‌ల సంఖ్య పెంపు

image

కాచిగూడ- యశ్వంత్‌పర వందే భారత్ కోచుల సంఖ్యను రైల్వే శాఖ పెంచింది. ప్రస్తుతం 8 కోచ్‌లు 530 సీటింగ్ కెపాసిటీతో నడుస్తున్న ఈ ట్రైన్ జూలై 10 నుంచి 16 కోచ్‌లు 1,128 సీటింగ్‌ కెపాసిటీతో పరుగులు పెట్టబోతోంది. ప్రస్తుతం 7 చైర్‌కార్, 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో నడుస్తుండగా ఇకపై 14 చైర్‌కార్, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

News July 7, 2025

HYD: TDF సిల్వర్ జూబ్లీ వేడుకలకు సీఎంకు ఆహ్వానం

image

అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ వేడుకలకు CM రేవంత్‌రెడ్డికి TDF ప్రతినిధులు ఆహ్వానించారు. కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9,10 తేదీల్లో జరిగే 25 ఏళ్ల వేడుకల పోస్టర్‌ను CM ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆ తర్వాత తెలంగాణలో TDF చేస్తున్న నిరంతర అభివృద్ధి పనులను CM ప్రశంసించారు. TDF ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్‌రెడ్డి, EX ప్రెసిడెంట్ కవిత చల్ల, సెక్రటరీ వినీల్ ఉన్నారు.

News July 7, 2025

HYD: ‘ఫిష్ వెంకట్‌ ఆస్పత్రి ఖర్చు ప్రభుత్వానిదే’

image

నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడిని మంత్రి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని ఆయన కుటుంబానికి హామీ ఇచ్చారు.