News September 20, 2025

HYD: అపరిశుభ్రంగా ప్రభుత్వ ఆసుపత్రుల కిచెన్లు..!

image

హైదరాబాద్‌లోని ఆస్పత్రుల కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ తనిఖీలు నిర్వహించారు. కోఠీ ENT, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, GWH సుల్తాన్ బజార్‌లో అపరిశుభ్రత, ఓపెన్ డస్ట్ బిన్లు, వంట గదిలో డ్రైనేజీ ఫ్లో గుర్తించారు. పరిసరాలు మురికిగా ఉన్నట్లు కనుగొని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి సూపరింటెండెంట్లకు ఆదేశించినట్లు వారు తెలిపారు.

Similar News

News September 20, 2025

BREAKING: HYD: నగరం నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ..!

image

హైదరాబాద్‌లో రౌడీ షీటర్ మహమ్మద్ అసద్‌పై 11కు మించి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హింసాత్మక స్వభావం, బెదిరింపులు, ప్రత్యర్థులపై హత్యాయత్నాలు చేసిన నేరస్థుడు అతడు. 2024లో అసద్ అనుచరులతో కలిసి ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుడిని హత్య చేశాడు. ఇటీవల మరో గ్యాంగ్‌పై దాడికి సిద్ధమవుతుండగా తుపాకీ, బుల్లెట్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఏడాదిపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు CP CV ఆనంద్ తెలిపారు.

News September 20, 2025

HYD: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: భట్టి

image

రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు HYD యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మహిళలను ఆర్థిక, సామాజిక శక్తివంతీకరణ, వ్యాపార శిక్షణ ఇచ్చి, కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.

News September 20, 2025

HYD: యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తాం: మంత్రి

image

HYDలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. మంత్రి రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తోన్న నెట్‌వర్క్ ఆసుపత్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.