News February 2, 2025
HYD: అప్డేట్ అయిన సిటీ డే పాస్
HYD సిటీ ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ 24 అవర్స్ టికెట్ అప్డేట్ అయింది. QR కోడ్, ఫోన్ నంబర్‌తో పాటు టికెట్ ప్రింట్ వస్తుంది. ఇంతకుముందు QR కోడ్ లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు చెల్లని డే పాస్‌లతో ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు కండక్టర్‌లు గుర్తించడం కష్టంగా ఉండేది. ఫోన్ నంబర్, QR కోడ్ ఉండడంతో నకిలీ టికెట్లు గుర్తించడం తేలిక అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Similar News
News February 2, 2025
చెరువుల రక్షణకై హైడ్రా కమిషనర్‌కు TDF రిపోర్ట్
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో హైడ్రా కమిషనర్ AV రంగనాథ్‌కు MLC ప్రొ. కోదండరాం, TDF అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి చెరువుల రక్షణకు సూచనలతో కూడిన రిపోర్టును అందచేశారు. TGలోని 46,500 చెరువులు, ముఖ్యంగా HYDతో కలుపుకొని 4 జిల్లాలలోని 1,042 చెరువులకు సంబందించిన డీటేయిల్ రిపోర్టును అందచేయగా, స్పందించిన హైడ్రా కమిషనర్ వచ్చే వారం రౌండ్ టేబుల్ సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు.
News February 2, 2025
జానారెడ్డితో పార్టీ పునర్వ్యవస్థీకరణపై మహేశ్ కుమార్ చర్చ
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్‌లో ఆదివారం కీలక చర్చ జరిపారు. కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించడం వంటి అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగినట్లు సమాచారం. ఈ సందర్భంగా గాంధీభవన్ వైపు అప్పుడప్పుడు రావాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని జానారెడ్డిని కోరారు.
News February 2, 2025
HYD: పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి
పిల్లల కడుపులో నులిపురుగులు చేరితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మేడ్చల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. నులి పురుగుల వల్ల చిన్నారుల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని సూచించారు.