News January 15, 2025
HYD: అప్పటి PV సింధు ఎలా ఉన్నారో చూశారా..?

ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అందరికీ సూపరిచితమే. ఆమె తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన తొలినాళ్ల జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ఫొటోను Xలో ప్రముఖ ఎడిటర్ ట్వీట్ చేశారు. మొట్ట మొదటిసారిగా నేషనల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకున్న అనంతరం సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఆమె నివాసంలో దిగిన ఫోటో ఇది. నేడు దేశానికి ఎన్నో విజయాలు సాధించి, గొప్ప పేరు తెచ్చారని పలువురు ప్రశంసించారు.
Similar News
News January 5, 2026
పాకిస్థాన్‌లోని ఉగ్రమూకలను లాక్కురండి: ఒవైసీ

ఇండియాలో పలు చోట్ల విధ్వంసం చేసి పాకిస్థాన్‌లో దాక్కున్న ఉగ్రమూకలను అక్కడకెళ్లి లాక్కురావాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. వెనుజులా అధ్యక్షుడినే అమెరికా తీసుకెళ్లినపుడు.. మీరు ఉగ్రవాదులను పాకిస్థాన్ నుంచి ఇక్కడకు తీసుకురాలేరా? అని ముంబయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీని ప్రశ్నించారు. పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులను లాక్కురండి అని పేర్కొన్నారు.
News January 5, 2026
HYD: పన్నుల లెక్క.. ఎవరి పవర్ ఎంత?

GHMC 300 వార్డుల పరిధిలో ఆస్తి పన్ను పంపిణీపై క్లారిటీ వచ్చేసింది. 10 వేల చదరపు అడుగుల లోపు ఇల్లు లేదా ప్లాట్ అయితే DC చూసుకుంటారు. అంతకంటే ఒక్క అడుగు ఎక్కువ ఉన్నా ఫైలు నేరుగా ZC టేబుల్‌పైకి వెళ్లాల్సిందే. 5ఏళ్ల కంటే పాత బకాయిల అడ్జస్ట్మెంట్ వ్యవహారాల్లోనూ ZC గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. చిన్న మార్పులకు లోకల్ ఆఫీసర్ సరిపోతారు. కానీ, పెద్ద ప్రాపర్టీల లెక్క మాత్రం జోనల్ లెవల్లోనే తేలుతుంది.
News January 5, 2026
HYD: JAN 5- 12 మధ్య కోల్డ్ వేవ్ 2.0

నగరం, శివారులో కొన్ని రోజులుగా మంచు తీవ్రంగా కురుస్తున్నా చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది. అయితే రేపటి నుంచి మళ్లీ చలి పంజా విసరనుందని అధికారులు చెబుతున్నారు. JAN 5- 12 వరకు 2వ Coldwave 2.0 ఉంటుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ సీజన్ డిసెంబర్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలే మళ్లీ నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలపారు. పగటిపూటే 25-26°Cకి పడిపోతాయని అంచానా వేశారు. ఈ వారం రోజులు నగరవాసులు జాగ్రత మరి.


