News March 23, 2024
HYD: అప్పుడు సన్నిహితులు.. ఇప్పుడు ప్రత్యర్థులు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, సికింద్రాబాద్ నుంచి గెలిచిన తీగుళ్ల పద్మారావు BRSలో ఉండి సన్నిహితంగా ఉన్నారు. కాగా ఇటీవల దానం కాంగ్రెస్‌లో చేరగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ బరిలో ఉన్నారు. మరోవైపు BRSనుంచి పద్మారావు పోటీలో ఉండగా ప్రస్తుతం వీరు ప్రత్యర్థులుగా మారారు. ఇద్దరు MLAలు ఎంపీ బరిలో ఉండడం గమనార్హం. అయితే వీరిలో ఎవరు గెలిచినా ఉప ఎన్నికలు మాత్రం అనివార్యం కానున్నాయి.
Similar News
News September 7, 2025
ఎల్బీనగర్: మానవత్వం చాటుకున్న సీపీ

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మానవత్వం చాటుకున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సీపీ పర్యవేక్షిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ప్రమాదానికి గురైన ఓ జంటను గమనించి, తన వాహనాన్ని నిలిపివేశారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సురక్షితంగా పంపించారు. నిమజ్జనంలో బిజీగా ఉన్నప్పటికీ సీపీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
News September 6, 2025
భవన నిర్మాణాల అనుమతులతో GHMCకి భారీ లాభం

GHMC భవన నిర్మాణాలకు భారీగా అనుమతులు ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో 4,389 నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, రూ.759.98 కోట్ల ఆదాయం గడించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చింది రూ.399.61 కోట్లు కాగా.. ఈసారి రూ.360.37 కోట్లు అదనంగా వచ్చింది. ఈ ఏడాది మొత్తం రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని GHMC అంచనా వేస్తోంది.
News September 6, 2025
బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర రూట్ ఇదే..!

HYDలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రధాన రూట్‌ను పోలీసులు ప్రకటించారు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాసెషన్ కట్ట మైసమ్మ ఆలయం, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మార్గాలుగా సాగి అంబేద్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, పీవీ ఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్దకు చేరుకోనుందని అధికారులు తెలిపారు.