News May 15, 2024

HYD: అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి: R.కృష్ణయ్య

image

తెలంగాణలో బీసీ కులగణన చేసి పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.

Similar News

News October 6, 2024

HYD: 2,525 చెరువులకు హద్దులు ఖరారు

image

HYD మహా నగరంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పర్యావరణవేత్తలు FTL, బఫర్ జోన్లను నిర్ధారించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెచ్ఎండీఏలోని 3,532 చెరువుల్లో 230కి మాత్రమే బఫర్ జోన్ నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులు ఖరారు చేశారు. కాగా మరో 1,000 చెరువులకు 3 నెలల్లో హద్దులను నిర్ధారించాల్సి ఉంది.

News October 5, 2024

BREAKING: HYD: ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ SUSPEND

image

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 5, 2024

HYD: ‘రేషన్ కార్డు లాగా FAMILY ఫొటో దిగాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా RR, MDCL జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 26 చోట్ల సర్వే ప్రారంభమైంది. ముందు కుటుంబ పెద్దగా మహిళ పేరు, వివరాలు తీసుకుని ఆ తర్వాత మిగితా వారి డీటేల్స్‌ను అధికారులు తీసుకుంటున్నారు. కాగా ఫ్యామిలీ అంగీకరిస్తేనే రేషన్ కార్డు తరహాలో అంతా కలిసి ఉన్న ఒక ఫొటో తీసుకుంటున్నారు. SHARE IT