News January 30, 2025
HYD: అఫ్జల్‌గంజ్ దొంగలను వదిలే ప్రసక్తే లేదు: సీపీ

HYDలోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు పరిశీలించి నిందితులు తెలివిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. కాగా.. దక్షిణాది రాష్ట్రాలకు చేరి అజ్ఞాతంలో ఉన్నట్లు HYD పోలీసులు నిర్ధారించారు. దోపిడీ దొంగలు తప్పించుకున్నా వారిని వదిలే ప్రసక్తే లేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Similar News
News November 10, 2025
రేపు రూ.477 కోట్లతో పరిశ్రమలకు శంకుస్థాపన

పెళ్లకూరు(M) సిరసనంబేడులో మంగళవారం రూ.477 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలకు మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టనున్నారు. ఉ.10 గంటలకు MSME పార్కు సహా మూడు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. CM చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించనున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కార్యాలయం తెలిపింది.
News November 10, 2025
ఘట్‌కేసర్: అందెశ్రీ అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించనున్నందున ఘట్‌కేసర్‌లోని ఎంఎల్ఏ క్యాంపు ఆఫీస్ పక్కన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. అందెశ్రీ అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అన్నీ శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.