News February 3, 2025

HYD: అబద్ధాలు చెప్పిన KCR: కోదండరాం రెడ్డి

image

కాళేశ్వరం కట్టతో పాటు అది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ KCR అవాస్తవాలు కూడా నిర్మించారని MLC కోదండరాం రెడ్డి ఆరోపించారు. HYD సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని TG మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. KCR అబద్ధాలు చెప్పారని, కాళేశ్వరంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.

Similar News

News February 3, 2025

కామారెడ్డి BJP జిల్లా అధ్యక్షుడిగా రాజు

image

కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నీలం రాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు జిల్లా అధ్యక్షురాలిగా అరుణాతార పనిచేశారు. ఆమె స్థానంలో రాజును నియమించారు .అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఆయన బీజేపీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించింది.

News February 3, 2025

నిధులు కేటాయించండి: పనగరియాకు చంద్రబాబు విజ్ఞప్తి

image

ఢిల్లీ పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అర్వింద్ పనగరియాను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం, నిధుల కేటాయింపులో పెద్ద మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసిందని పనగరియా వద్ద నేతలు ప్రస్తావించారు.

News February 3, 2025

సోన్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందిన ఘటన సోన్ మండలంలో జరిగింది. స్థానిక ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. పాక్‌పట్ల గ్రామానికి చెందిన నరసయ్య (48) తన పంట చేనుకు నీరు పెట్టడానికి సోమవారం ఉదయం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు.