News December 15, 2025

HYD: అబార్షన్ చేసుకోమని ఒత్తిడి.. బాలిక సూసైడ్ అటెంప్ట్

image

HYDలో విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఓ బాలికను గర్భవతి చేసిన యువకుడు, గర్భస్రావం చేయించుకోమని ఒత్తడి చేశాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై మధురానగర్ PSలో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును జగద్గిరిగుట్ట PSకు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 17, 2025

గద్వాల్ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం ఇక్కడే..!

image

అలంపూర్ మండల కేంద్రంలోని బైరంపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు స్వాతి 92 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విజయం అనంతరం స్వాతి మాట్లాడుతూ.. బైరంపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో బైరంపల్లి గ్రామంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

News December 17, 2025

నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

image

నేరేడుగొమ్ము మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీలకు సర్పంచ్ ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిశాయి. చిన్నమునిగల్ గ్రామపంచాయతీలో మొదటి ఫలితం వెలువడింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇస్లావత్ వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆయన బాబుపై 102 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

News December 17, 2025

ఐటీఐ అర్హతతో 156 పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<>HAL<<>>)156 ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే రూ.22,000+DA,HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in/