News June 21, 2024

HYD: అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

image

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి పనులు సాధ్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈరోజు HYD పటాన్‌చెరు పరిధి తెల్లాపూర్‌లో రూ.8.40 కోట్లతో నూతనంగా నిర్మించిన తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం, ఆడిటోరియంను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.

Similar News

News October 4, 2024

దసరా పండుగకు 6000 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా TGRTC 6000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని కూకట్పల్లి ఆర్టీసీ డిపో డీఎం హరి తెలిపారు. రద్దీకి అనుగుణంగా జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, MBNR, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, కర్నూల్, అనంతపురం ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు డీఎం స్పష్టం చేశారు.

News October 4, 2024

గోవా వెళ్తున్నారా..? సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు

image

సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.

News October 3, 2024

HYD: గుడ్డిగా నమ్మితే నట్టేట మునుగుతారు.. జాగ్రత్త!

image

‘కర్ణుడి చావుకు సవాలక్ష’ కారణాలు అన్నట్టు HYDలో సైబర్ నేరాలతో రూ.కోట్లు మోసపోతున్న పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక వడ్డీతో ఆశ చూపటం, ట్రేడింగ్, కస్టమర్ కాల్ సెంటర్, హెల్ప్ లైన్ పేరిట, హై ప్యాకేజీ జాబ్, OTP మోసాలు, ఫేక్ లింకులు, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, ఉచిత విదేశీ ప్రయాణాలు, మ్యాట్రిమోనీ పేరిట మాయ మాటలు చెప్పి నట్టేట ముంచి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జర జాగ్రత్త!