News April 22, 2025
HYD: అమర్నాథ్ యాత్ర.. ఇవి తప్పనిసరి!

అమర్నాథ్ యాత్రకు వెళ్లేవారికి గాంధీలో ప్రతి సోమ, బుధ, శుక్రవారాలలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పలు వైద్య పరీక్షలు మాత్రం తప్పనిసరి చేయించుకోవాలి. CBP/ESR, సీయూఈ, ఈసీజీ, చెస్ట్ ఎక్స్ రే, ఎస్ క్రియేటినిన్, ఎఫ్బీఎస్/పీఎల్బీఎస్, బ్లడ్ గ్రూప్‌తో పాటు 50 ఏండ్లు పైబడినవారికి తమ 2 మోకాళ్ల ఎక్స్ రే అవసరం. అప్లికేషన్ మీద ఫొటో పెట్టి గాంధీలో ఇస్తే మెడికల్ సర్టిఫికెట్ ఇస్తారు.
SHARE IT
Similar News
News April 22, 2025
తప్పడం తప్పు కాదు.. తొందరపడొద్దు..!

ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. పాసైనవాళ్లు సంబరాలు చేసుకుంటే.. ఫెయిలయ్యామని, మార్కులు తక్కువొచ్చాయని కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు భావించకండి. ఇప్పుడు తప్పితే.. సప్లీ అనే సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ, తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. మీరే ప్రాణంగా బతికే మీ వాళ్ల జీవితకాలపు కన్నీళ్లకు కారకులవుతారు. తప్పడం తప్పు కాదని గ్రహించి.. సప్లీలో పాసై కాలర్ ఎగరేయండి. All The Best
News April 22, 2025
పెద్దపల్లిలో మందకొడిగా పత్తి విక్రయాలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇటీవల వర్షాలు, ధర పెరుగుతుందన్న కారణంగా రైతులు మార్కెట్‌కు పత్తిని తక్కువగా తీసుకొస్తున్నారు. పత్తి విక్రయాలు స్వల్పంగా ధర పెరిగింది. ప్రస్తుతం పత్తి నాణ్యతను బట్టి క్వింటాల్‌కి రూ.6,800 నుంచి రూ.7,200 వరకు ధర పలుకుతోంది.
News April 22, 2025
పెద్దపల్లి: ఆర్ఎంపీలకు వైద్య అధికారిణి హెచ్చరిక

పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎంపీలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి అన్న ప్రసన్న కుమారి పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్ఎంపీలు తమ పరిధిలోనే ఉండాలని, కేవలం ప్రథమ చికిత్సకే పరిమితమవ్వాలని సూచించారు. అనధికారికంగా మేజర్ చికిత్సలు చేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.